AP Model Schools Admission 2025-26, 6th Class Admission 2025
|Director of School Education Andhra Pradesh has released AP Model School Admission 2025-26 notification. Press notification was issued for conducting VI class entrance test for admission into 164 model schools in the state for the academic year 2025-26.
AP Model Schools Admission 2025 Schedule
The attention of the District Educational Officers and all the Principals of AP Model Schools in the State are hereby informed that a press notification was issued for conducting VI Class Entrance Test for admission into 164 Model Schools in the State for the Academic Year 2025-26.
The following tentative schedule is proposed to conduct the Admission Test for admission into VI Class in AP Model Schools.
Event | Schedule |
Date of Issue Press Note | 20-02-2025 |
Date of gateway payment of Examination fee | 24-02-2025 |
Acceptance of Online Application | 25-02-2025 |
Last Date for fee Payment | 31-03-2025 |
Date of Examination(at School) | 20-04-2025 |
Publication of Merit List | 27-04-2025 |
Publication of Selection List | 27-04-2025 |
Certificate Verification & Counselling | 30-04-2025 |
Date of Commencement of Classes | June 2025 (As decided by the Govt.) |
ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలొ 2025 – 26 విద్యా సంవత్సరములొ 6 వ తరగతిలొనికి ప్రవేశము కొరకు ప్రకటన నోటిఫికేషన్ తేది: 21-02-2025
ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2025-2026 విద్యా సంవత్సరమునకు ‘6’ వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై తేది. 20.04.2025 (ఆదివారము) నాడు రాష్ట్ర వ్యాప్తముగా ప్రవేశ పరీక్షలు నిర్వహించబడును.
ఏ మండలములో ఆదర్శ పాఠశాలలు పనిచేయుచున్నవో ఆ పాఠశాలల యందే 20.04.2025 న ఉ. 10-00 గం.ల నుండి ఉ. 12-00 గం. ల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రవేశ పరీక్ష 5 వ తరగతి స్థాయిలో తెలుగు / ఇంగ్లీషు మీడియములో నిర్వహించబడును. ఈ ఆదర్శ పాఠశాలలో బోధనా మాధ్య మము ఆంగ్లములోనే ఉండును. ఈ పాఠశాలలో విద్యనభ్యసించుటకు ఎటువంటి ఫీజులు వసూలు చేయబడవు.
AP Model Schools 6th Entrance Eligibility
ప్రవేశ అర్హతలు:
1) వయస్సు: ఒ.సి, బి.సి. (OC, BC) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2013 to 31- 08-2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. (SC, ST) కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2011 – 31-08-2015 మధ్య పుట్టి ఉండాలి.
2) సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2023-24 మరియు 2024-25 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
3) ధరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచారపత్రము కొరకు www.cse.ap.gov.in or www.apms.apcfss.in చూడగలరు.
AP Model Schools Admissions 2025-26 Application Process
ధరఖాస్తు చేయు విధానము:
అభ్యర్థులు పై అర్హత పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తేది.24-02-2025 నుండి 31-03-2025 net banking/ credit/debit card లను ఉపయోగించి Payment Gateway ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును. ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ www.cse.ap.gov.in www.apms.ap.gov.in (Online లో) దరఖాస్తు చేసుకోవలెను.
AP Model Schools Entrance Exam Fee 2025
- పరీక్షా రుసుము: OC మరియు BC లకు: రూ. 150/-(అక్షరాల 150/- రూపాయలు మాత్రమే) SC మరియు ST లకు రూ.75/- (అక్షరాల 75/- రూ. మాత్రమే).
- 6 వ తరగతి ప్రవేశమునకు పై ప్రవేశ పరీక్షల్లో OC మరియు BC విద్యార్థులు మార్కులు SC మరియు ST విద్యార్థులు కనీసం 30 మార్కులు పొందియుండవలెను.
- 6 ప్రవేశములు ప్రతిభ ఆధారముగా (అనగా ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారముగా) మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.